గుడ్లవల్లేరు, (ప్రభ న్యూస్) : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం 2 మంగళవారం విఆర్వోగా విధులు నిర్వహిస్తున్న వసుంధర గుడ్లవల్లేరు శివారు గ్రామమైన వేముగుంటలో 2.44 ఎకరాల పొలానికి పట్టాదారు పాస్ పుస్తకం పేరు మార్చినందుకు విఆర్వో వసుంధర రూ.10 వేలు డిమాండ్ చేయగా రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డి.ఎస్.పి లు శరత్ బాబు, శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు విఆర్వో వసుంధర లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
దీంతో ఒక్కసారిగా అధికారులు ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు ఏ చిన్న పనికైనా బాధితులను అధికమొత్తంలో లంచలు డిమాండ్ చేయడంతో ప్రభుత్వ సేవలను పొందవలసిన బాధితులు విసిగి వేసారి న్యాయం చేయండి బాబూ అంటూ ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. గత రెండేళ్ల క్రితం మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శిని రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డటం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..