ఏపీలో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ నిరుద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ మేరకు కొన్నిరోజులుగా నిరుద్యోగులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సోమవారం నాడు విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలువురు నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా నిరుద్యోగుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement