పామర్రు : కృష్ణా జిల్లా పామర్రులో ఓ మాయగాడు మైనర్ బాలికను(15) ప్రేమించానని… పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. అనంతరం పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఆ మైనర్ బాలిక ప్రైవేట్ హాస్పిటల్ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ ఘటన పామర్రు మండలం కొమరవోలులో చోటుచేసుకుంది. ఈ విషయమై దాసరి నాగ గోవిందుపై మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement