Friday, November 22, 2024

ఇక కృష్ణా రీజియన్‌, ఎన్టీఆర్‌ రీజియన్‌గా మారనుంది.. ఆర్టీసీలోనూ విభజన

కృష్ణా, ప్రభన్యూస్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఆర్టీసీ పునర్విభజన చేశారు. కృష్ణాజిల్లా పరిధిలో విజయవాడ ఆర్డీసి రీజయిన్‌ కృష్ణా రీజియన్‌, ఎన్టీఆర్‌ రీజియన్‌లుగా విభజించారు. కొత్త జిల్లాలతో పాటు ఉగాది నుంచి కొత్త ఆర్టీసి రీజియన్‌లు కూడా త‌పనిచేయనున్నారు. కృష్ణాజిల్లాలో మొత్తం 14 బస్సు డిపోలు, 1057 ఆర్టీసీ సొంత బస్సులున్నాయి. ఈ బస్సులను రెండు జిల్లాలకు కేటాయించారు. ఎన్‌టీఆర్‌ విజయవాడ జిల్లాకు 8 డిపోలు, 643 బస్సులు, కృష్ణా జిల్లాకు 6 డిపోలు, 414 బస్సులను కేటాయించారు. అంటే ఎన్టీఆర్‌ జిల్లాకు అత్యధిక డిపోలు బస్సులు దక్కనున్నాయి. నూతన ఎన్టీఆర్‌ జిల్లా కింద విజయవాడ నగర పరిధిలో ఉన్న ఆటోనగర్‌, గవర్నర్‌పేట-1, గవర్నర్‌పేట-2, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్‌ డిపోలతో పాటు, విజయవాడ, తిరువూరు, జగ్గయ్యపేట బస్‌ డిపోలు కేటాయించారు. కృష్ణాజిల్లాకు మచిలీపట్నం, అవనిగడ్డ, ఉయ్యూరు, గన్నవరం, గుడివాడ బస్‌ డిపోలను కేటాయించారు.

నూజివీడు డిపోను ఏలూరు జిల్లాలో కలవనున్నది. ఎన్టీఆర్‌ జిల్లా కింద విజయవాడలో తిరిగే సిటీ బస్సులతో పాటు, అత్యంత ఖరీదైన హైఎండ్‌ బస్సులు కేటాయించారు. డాల్ఫిన్‌, అమరావతి, వెన్నెల స్లీపర్‌, గరుడ, గరుడ ప్లస్‌, నైట్‌ రైడర్‌, సింహభాగం సూపర్‌ లగ్జరీ బస్సులు, ఆల్ట్రా డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతోపాటు సిటీ పరిధిలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, సీఎన్‌జీ బస్సులు ఎన్టీఆర్‌ జిల్లాకు కెటాయించారు. కృష్ణా జిల్లాకు ఎక్కువుగా పల్లె బస్సుల కేటాయించారు. పల్లె బస్సుల్లో లాంగ్‌స్టాండ్‌ రూట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు సూపర్‌ లగ్జరీ బస్సులు, ఇంద్ర ఏసీలు, స్వల్ప సంఖ్యలో అమరావతి, గరుడ, గరుడ ప్లస్‌ బస్సులను కూడా కేటాయించారు. ఎక్కడి అధికారులు, ఉద్యోగులే అక్కడే పని చేస్తారు. ప్రస్తుత ఆర్‌ఎం, డీసీటీఎం, డీసీఎంఈ, డిపో మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, పాలనా పరమైన సిబ్బంది ఎక్కడి వారు అక్కడే ఉంటారు. అన్ని శాఖల మాదిరిగానే ఆర్టీసీలో బస్‌లు, ఉద్యోగులు పంపకాలు పూర్తి చేశారు. ఉగాది నుంచి కొత్త రీజయిన్‌ల నుంచి పాలన సాగనున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement