పాయకాపురం, విజయవాడ కార్పొరేషన్ : సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందు జరుగుతున్న ఆధునీకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలనీ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. అధికారులతో కలసి ఈరోజు గాంధీనగర్ లోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ నందు జరుగుతున్న ఆధునీకరణ పనుల పురోగతిని పరిశీలించారు. సత్వరమే పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ నందలి నిర్మాణంలో ఉన్న పనులు వేగవంతం చేసి యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమయ్యే అన్ని మౌలిక సదుపాయాలతో, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పూల్ నందలి గ్రీనరి ఏర్పాటు పనులను పరిశీలిస్తూ, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ఆకర్షణీయమైన మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెనువెంటనే మిగిలిన డేబ్రిష్, వ్యర్ధములను అక్కడి నుండి తరలించి స్విమ్మింగ్ పూల్ ఆవరణమంతా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.