Friday, November 22, 2024

వృద్ధ దంపతుల ఆత్మహత్య

విజయవాడలో వాంబే కాలనీకి చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కొండయ్య, మైసమ్మ అనే దంపతులు వాంబేకాలనీలో రెండో బ్లాక్‌లో నివాసముంటున్నారు. రెండురోజులుగా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారి ఇంటి కిటికీల నుంచి చూడగా విగతజీవులుగా ఉన్నారు. వెంట‌నే స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దంపతుల మృతిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement