Thursday, September 19, 2024

AP: అమరావతిలో స్పోర్ట్స్ హబ్… ఎంపీ కేసినేని శివనాధ్

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో స్పోర్ట్స్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాధ్ ప్రకటించారు. రాజధాని ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో స్టేడియం నిర్మాణాలను చేపట్టి అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కార్యాలయంలో గురువారం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ బాడీ కౌన్సిల్ సమావేశాన్ని ఏసీ అధ్యక్షుడు కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముందుగా మంగళగిరి అంతర్జాతీయ స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అకాడమీ సభ్యులతో కలిసి పరిశీలించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాద్ మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అపెక్స్ బాడీ కౌన్సిలింగ్ మొదటి స‌మావేశం జరగటం ఆనందంగా ఉందన్నారు. మంగళగిరి క్రికెట్ స్టేడియం పూర్తి చేసి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో రోడ్లు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైజాగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో క్రికెట్ స్టేడియంతో పాటు త్వరలోనే స్పోర్ట్స్ హబ్ కూడా ఏర్పాటు చేస్తామని, వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్టేడియం నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement