Saturday, November 23, 2024

బాలుడి శస్త్ర చికిత్సకు సోనుసూద్ సహాయం

తిరువూరు: మండలంలోని మల్లేలు కి చెందిన గంజి నవీన్ మౌనిక ల రెండు సంవత్సరాల కుమారుడు సంపూర్ణ రావుకు శస్త్ర చికిత్స కోసం సినీ నటుడు సోనుసూద్ ఆర్థిక సాయం అందజేసేందుకు ముందుకు వ‌చ్చారు. సుమారు రూ 8 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని విజయవాడలోని కార్డియాలజిస్టు లు తెలపగా పిఎసిఎస్ అధ్యక్షుడు కలకొండ రవికుమార్ జన విజ్ఞాన వేదిక ప్రతినిధుల ద్వారా సోనూసూద్ సహాయం కోరారు. ముంబైలోని ఎస్సార్సీసీ ఆస్పత్రిలో బాలుడికి ఈ నెల 3న శ‌స్త్ర‌ చికిత్స చేయగా సోను సూద్ రూ. 4 లక్షలు ఆర్ధిక సాయం చేసిన‌ట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి తెలిపారు. శ‌స్త్ర చికిత్స అనంత‌రం బాలుడు సంపూర్ణంగా కోలుకున్నాడు.. త‌మ బిడ్డ‌కు ప్రాణ‌దానం చేసిన వైద్యుల‌కు, ఆర్థిక సాయం అంద‌జేసిన సోనూ సూద్ కి బాలుడి త‌ల్లిదండ్రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement