విజయవాడ – టిడిపి అధినేత చంద్రబాబు కస్టడీ విచారణ నివేదికను కోర్టుకు సీఐడీ సమర్పించింది. సీల్డ్ కవర్‌లో దాన్ని అందజేసింది. దీంతో పాటు చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కావాలని కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు నేటి మధ్యాహ్నం వింటామని న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఎసిబి కోర్టులో నేడు వాదనలు ప్రారంభమయ్యాయి. దీనిపై సీఐడీ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ లో దాఖలు చేసిన రెండు పేరాలపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు.. దీంతో మళ్లీ సవరించి కౌంటర్ ను సిఐడి న్యాయవాదులు దాఖలు చేశారు. దీనిపై వాదోప వాదాలు కొనసాగుతున్నాయి..
Skill Case – చంద్రబాబు కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు అందించిన సిఐడి
Advertisement
తాజా వార్తలు
Advertisement