Sunday, October 6, 2024

AP | మానవ మేదస్సుకి ఉదాహరణ సింగపూర్: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్

ప్రభ న్యూస్, విజయవాడ : మానవ అద్భుత మేదస్సుకి నైపుణ్యానికి మంచి ఉదాహరణ సింగపూర్ అని తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. శరవేగంగా సింగపూరు అభివృద్ధి జరిగిన తీరు అన్ని దేశాలకు ఆదర్శప్రాయం అన్నారు.

సింగపూరు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అక్కడ జరుగుతున్న ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం సింగపూర్లో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101 జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన తెలుగుజాతికి ఎన్టీఆర్ చేసిన కృషిని కీర్తించారు.

ఖండాంతరాలు దాటిన తెలుగువారి గౌరవం ఖ్యాతి ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. సింగపూర్ లో తెలుగు వారితో భేటీ అయిన ఆయన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ నగరం లాస్ట్ మాస్టర్ ప్లాన్ ను పరిశీలించిన ఆయన సింగపూర్ అభివృద్ధికి అద్భుత ఉదాహరణ అంటూ కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement