Tuesday, November 19, 2024

అంగన్వాడీ నాడు-నేడు పథకంపై సమీక్ష

ఎ. కొండూరు – మండలంలోని కంభం పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం మన అంగన్వాడీ నాడు-నేడు పథకం అభివృద్ధి కమిటీ సభ్యుల మండల స్థాయి సమావేశం సిడిపిఓ సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతనంగా నిర్మించే అంగన్వాడీ భవనాల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో కూడి ఉండాలని, క్వాలిటీ తో కూడిన సిమెంటు ఇసుక ఐరన్ వాడాలని సూచించారు. ఈ భవనాల నిర్మాణంపై అంగన్వాడీ అడ్వైజర్ కమిటీ పూర్తి బాధ్యత వహించి పర్యవేక్షించాల న్నారు. మండలంలో 13 అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణం చేయడం జరుగుతుందని, 7 అంగనవాడి కేంద్రాలకు మరమ్మతులు చేయడం జరుగుతుందని, ఒక్కొక్క నూతన భవనానికి రూ. 14 లక్షలు, మరమ్మతుల నిమిత్తం రూ ఆరు లక్షల 90వేలు మంజూరు అయినట్లు తెలిపారు. భవనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. మండలంలో 13 అంగన్వాడీ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి బ్యాంకులోజీరో ఖాతా తెరిపించడం జరిగిందన్నారు. అభివృద్ధి కమిటీ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడి సూపర్వైజర్ అంగన్వాడీ టీచర్, కార్యదర్శి, , ప్రీస్కూల్ విద్యార్థుల తల్లులు ముగ్గురు తో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులతో ఉంటారని వీరిలో కన్వీనర్ గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారన్నారు. కాంట్రాక్టు పనులు అప్ప చెప్పకుండా మొత్తం నిర్మాణ పనులు అభివృద్ధి కమిటీ సభ్యుల పర్యవేక్షణలో జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఏఈ షేక్ జాని, వెలుగు ఏపీఎం ఆర్. సత్యం, రెండు సెక్టార్ ల సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement