Monday, November 25, 2024

కనకదుర్గమ్మకు కాసుల వర్షం.. గోల్డ్ బాండ్స్ పై కోటి పదిలక్షల ఆదాయం..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : అమ్మలకే అమ్మగా, కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా పేరుందిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలోని కనకదుర్గమ్మ వారికి కాసుల వర్షం కురుస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు వివిధ రూపాల్లో విరాళాలను అందించడంతోపాటు, నిత్యం నిర్వహించే సేవలు టికెట్ల రూపంలో ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది.

కనకదుర్గమ్మ వారికి భక్తులు ప్రేమతో విరాళంగా ఇచ్చే బంగారు, వెండి వస్తువుల పైన కూడా ఆలయానికి అదనపు ఆదాయం వస్తోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ 158 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, ఏడాది గోల్డ్ స్కీం ద్వారా అమ్మవారి ఆలయానికి రూ కోటి 11 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. భక్తులు సమర్పించే కానుకలతో పాటు హుండీ ద్వారా వచ్చే బంగారు వెండి వస్తువులను 1999 నుండి ఆలయ అధికారులు అప్రైజ్ చేస్తూ ఉన్నారు. 2012 నుండి ఆలయంలో మిగులుగా ఉన్న బంగారాన్ని గోల్డ్ స్కీం ద్వారా ఎస్బిఐలో డిపాజిట్ చేయడం ఆనవాయితీగా వస్తుంది.

- Advertisement -

ఈ క్రమంలో 2020 వరకు గోల్డ్ డిపాజిట్ ద్వారా ఆలయానికి సంబంధించిన మొత్తం 157 కేజీల,70 గ్రాముల 380 మిల్లీగ్రాముల గోల్డ్ ను, ఏడు గోల్డ్ బాండ్స్ రూపంలో అధికారులు డిపాజిట్ చేశారు. 1999 నుండి 2021 నవంబర్ నెలకి వరకు మిగిలి ఉన్న బంగారు, వెండి వస్తువులను అప్రైజ్ చేసి వినియోగించనీ బంగారాన్ని వస్తువులను గోల్డ్ బాండ్ స్కీం కింద అధికారులు ఎస్బిఐ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి బంగారు, వెండి వస్తువులను అప్రైజ్మెంట్ జరిపి గోల్డ్ బాండ్ స్కిన్ కింద డిపాజిట్ చేస్తూ రావడం ఆనవాయితీగా వస్తుంది.

ఏడాది జూన్ 7వ తేదీ నాటికి గోల్డ్ స్కీం బాండ్స్ కింద 38 కేజీల 147 గ్రాముల 591 మిల్లీగ్రాముల బంగారాన్ని నాలుగు బాండ్ల రూపంలో డిపాజిట్ చేశారు. మొత్తం 11 గోల్డ్ బాండ్స్ కింద అమ్మవారికి సంబంధించిన బంగారం 195 కేజీల 217 గ్రాముల 971 మిల్లీగ్రాములుగా లెక్క తేలింది. ఒక్కో గోల్డ్ బాండ్ కి ఐదు సంవత్సరాల కాల పరిమితిని ఎస్బిఐ నిర్ణయించగా, ఒక సంవత్సరానికి 2.25% బంగారం, లేక ఆ తేదీ నాటికి ఉన్న బంగారు విలువకు అమ్మవారి ఆలయానికి వడ్డీ రూపంలో ప్రతి ఏటా డిపాజిట్ చేసిన బ్యాంకులు చెల్లిస్తున్నాయి.

ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో అమ్మవారి అలంకారం తో పాటు వివిధ కార్యక్రమాల కోసం 28 కేజీల బంగారాన్ని వినియోగిస్తున్నారు. బంగారంతో పాటు వెండిని కూడా అప్లై చేసి నిరుపయోగంగా ఉన్న వెండిని కరిగించి వెండి బార్లుగా మార్చడంతో 96 బార్సుగా లెక్క తేలింది. దీని విలువ 14 15 కేజీల 430 గ్రాములుగా లెక్క తేల్చి బ్యాంకు లాకర్స్ లో బద్ధపరిచారు.

ప్రస్తుతం అమ్మవారికి వివిధ రూపాల్లో 320 కేజీలకు పైగా వెండి లభించగా వాటిని కరిగించి బార్లలోను గోల్డ్ బాండ్స్ గా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం అమ్మవారి అలంకరణ వివిధ రూపాల కోసం 400 కేజీల బంగారాన్ని వినియోగిస్తున్నారు. 20 22 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ గోల్డ్ బాండ్స్ కింద కోటి 12 లక్షల రూపాయల నికర ఆదాయం అమ్మవారి ఆలయానికి సమకూరినట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రమరాంబ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement