Saturday, November 23, 2024

కరోనా ట్రీట్మెంట్ పై మంత్రి పేర్ని నాని సమీక్ష

మచిలీపట్నం – పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాకలెక్టర్,వైద్యాధికారులతో పశ్చిమగోదావరి జిల్లాలో కోవిడ్ పరిస్థితి, ఆక్సిజన్ మేనేజ్మెంట్, రెమ్ డిసివర్ ఆడిట్ తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రివర్యులు శ్రీ పేర్ని వెంకట రామయ్య( నాని ) శుక్రవారం మచిలీపట్నంలో మంత్రి నివాసం నుండి సమీక్ష నిర్వహించారు.

జూమ్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

జిల్లాలో ఆక్సిజన్ బెడ్లు పెంపు చేయాల్సిన అవసరం ఉందని, చికిత్స పొందుతున్న రోగులతో కేవలం నర్సులే మాట్లాడుతున్నారు గాని వైద్యులు లు వారితో మాట్లాడటం లేదని చాలా మంది రోగులు ఫిర్యాదు చేస్తున్నారని పలువురు ప్రజా ప్రతినిధులు కాన్ఫరెన్స్లో తెలిపారు.

ఆస్పత్రులలో కరోనా రోగులకు చికిత్స అందించడంతోపాటు రోజులో కనీసం ఒకసారైనా కరోనా రోగులతో వైద్యులు మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని అధికారులకు సూచించారు.

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కారణంగా పాజిటివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 20 వేల పైగా వస్తున్నాయని ఈ పరిస్థితులలో జిల్లాలో ఆసుపత్రులలో కరోనా రోగులకు వైద్య చికిత్స పట్ల ఇంచార్జ్ మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా అధికార బృందం ఎక్సలెంట్ గా పనిచేస్తున్నదని, మీ శక్తికి మించి మీ స్థాయికి మించి పని చేస్తున్నారని కితాబిచ్చారు.

- Advertisement -

ప్రభుత్వం ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటుందన్నారు.

జిల్లాలో ముఖ్యంగా రూరల్ ఏరియాలలో ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లు సేకరించి ఏర్పాటు చేయుటకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఇన్చార్జి మంత్రి సూచించారు.

రాబోయే పది రోజుల్లో ఆశ్రం ఆసుపత్రి లో 400 ఆక్సిజన్ బేడ్స్ అదనంగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు, జిల్లాకు మరో 100 ఆక్సిజన్ కాన్సెంట్రేట్లు ప్రభుత్వం కేటాయించేలా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు

తొలుత జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు, ఆసుపత్రిలో సౌకర్యాలు గురించి ఇన్ ఛార్జ్ మంత్రికి వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి 2760 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, 9458 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని, 779 మంది కోవిడ్ కేర్ సెంటర్లలో, 1981 మంది వివిధ ఆస్పత్రులలో ట్రీట్మెంట్ పొందుతున్నారని, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 1981 మందిలో 343 మంది ఐసియు లో, 1097 మందిఆక్సిజన్ సపోర్టుతో, 541 మంది నాన్-ఆక్సిజన్ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు కలెక్టర్ వివరించారు.

జిల్లాలో ఆరు ప్రభుత్వ ఆసుపత్రులు, 18 ఆరోగ్యశ్రీ ఎంప్యనల్ ఆస్పత్రులు, 4 తాత్కాలిక ఆరోగ్యశ్రీ ఎంప్యానల్ ఆసుపత్రులు, 4 ఇతర అనుమతించిన ఆస్పత్రులు మొత్తం 42 ఆస్పత్రులలో 351 ఐసియు బెడ్ లు, ఆక్సిజన్ బెడ్లు1190, నాన్ ఆక్సిజన్ బెడ్లు1406, మొత్తం 2947 బెడ్లు కరోనారోగులకు అందుబాటులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఆశ్రం హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, తాడేపల్లిగూడెం తణుకు ఏరియా హాస్పిటల్ భీమవరం కొవ్వూరు నర్సాపురం సి హెచ్ సి లలో రోజుకు 6500 మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు, అన్ని పీహెచ్సీలలో సరిపడా రాపిడ్ కిట్స్ అందుబాటులో ఉన్నట్లు, 23 మొబైల్ వాహనాల ద్వారా కరోనా శాంపిల్స్ సేకరించి టెస్టులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు

జిల్లాలో 5000 బెడ్స్ సామర్థ్యంతో 6 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కరోనా రోగులకు అవసరమైన ట్రీట్మెంట్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆక్సిజన్ ఆడిట్ మరియు జిల్లా స్థాయిలో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.

వివిధ ప్రాంతాల నుంచి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కరోనా నోడల్ అధికారులు, వైద్య అధికారుల అనుభవాలు ఇన్చార్జి మంత్రి అడిగి తెలుసుకున్నారు

జాయింట్ కలెక్టర్లు కే. వెంకట రమణారెడ్డి, హిమాన్షు శుక్ల, జిల్లా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement