Tuesday, November 26, 2024

సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధుల బాధ్యత – మంత్రి పేర్ని నాని

మ‌చిలీప‌ట్నం – నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించి ఆయా సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధులుగా తమ ముఖ్య బాధ్యతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. బుధవారం ఉదయం 6: 40 గంటల సమయంలో ఆయన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44 వ డివిజన్ ( రుస్తుంబాద ) వద్ద సయ్యద్ బాజీ బాబా గారి జెండా రోడ్డులో 4 లక్షల 85 వేల రూపాయలతో 65 మీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గతంలో ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటికీ ఇటీవల పైప్ లైన్ నిర్మాణంలో ఈ రోడ్డు పాక్షికంగా దెబ్బతినడం జరిగిందన్నారు. దీంతో వార్డు ప్రజల రాకపోకలకు ఎంతో ఇబ్బంది ఏర్పడిందని ఈ విషయం తన దృష్టికి మామిడిబత్తుల అజయ్ కుమార్ స్థానిక పెద్దలు తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలకు ఈ వసతి ఒనగూర్చడానికి రోడ్డు నిర్మాణంకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సిసి రోడ్డు శంఖుస్థాపన కార్యక్రమంలో 44 వ డివిజన్ కార్పొరేటర్ నరహరశెట్టి రోజా ఎం ఇ త్రినాధ్ రావు, ఏ ఇ వర ప్రసాద్, పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement