పొలాలలో పేరుకుపోతున్న ధాన్యపు నిల్వలు..
ధాన్యం కొనుగోలుకు చొరవ చూపని అధికారులు
పెట్టుబడుల కోసం తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులు..
కృత్తివెన్ను – రైతన్న చిందించే స్వేదా నికి అధికారులు ఖరీదు కట్టడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆరుగాలం ఎండనకా వాననకా కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర దక్కక పోవడంతో రైతులు కృంగిపోతున్నారు. వాతావరణంతో పాటు అధికారులు దళారులు కూడా రైతులను మోసం చేయడంతో పండించిన ధాన్యాన్ని దాచుకోలేక, బస్తాలలో వ నిలువ చేయలేక ,అధిక రేటు కోసం ఎదురుచూపులు చూడలేక తక్కువ ధరలకే తెగనమ్ముకుంటున్నాడు. రైతులకు మద్దతు ధర అందిస్తున్నామని పాలకులు అధికారులు చెప్పిన మాటలు నీటి మూటలు లాగా మిగిలిపోతున్నాయి. ధాన్యం కొనుగోలు కోసం ఆర్భాటాలతో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులతో పాటు అధికారులు కూడా వెక్కిరిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడికక్కడే ధాన్యపు రాశులు నిలువ ఉండటంతోపాటు పండిన ధాన్యాన్ని దాచుకోలేక.. మరో దారి లేక.. వ్యాపారులు నిర్ణయించిన ధరకే రైతులు తన పంట ను అమ్ముకోవాల్సి వస్తుంది..
వివరాలు పరిశీలిస్తే..
పెడన నియోజకవర్గంలో దాదాపు కృత్తివెన్ను బంటుమిల్లి పెడన గూడూరు లోని కొన్ని ప్రాంతాలలో 60 వేల ఎకరాలకు పైగా రబీలో వరిపంట సాగవుతుంది.గత ఏడాది కన్నా ఈ సంవత్సరం సాగునీరు పుష్కలంగా లభించడంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత సంవత్సరం పంట చేతికందే సమయానికి వడగండ్ల వాన రూపంలో రైతుల్ని కొంత మేర నష్ట పరచి నా ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు ఎంతో ఆనందంగా వ్యవసాయ పనులు పూర్తి చేశారు. అన్నిచోట్ల ఎకరానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడి రావడంతో రైతులకు ఎంతో ఆనంద కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపుగా వ్యవసాయ అంతా యంత్రాలతో రైతులు వ్యవసాయ పనులు పూర్తిచేశారు. సరిగ్గా పండిన పంట గిట్టుబాటు ధరకు అమ్ముకుని ఆశతో ఉన్న రైతులకు అడియాసలు గానే మారాయి. ఫలితంగా గా ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరలకు రైతులు కి లభించే వరకు ఎక్కడా కూడా పొంతన లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యంత్రాల ధాన్యం బస్తాలు 1000 కే..
వ్యవసాయ రంగం అంతా యంత్రాలపై ఆధారపడటంతో రైతులు కూడా మరి యంత్రాల ద్వారానే వ్యవసాయాన్ని పూర్తిచేశారు దీనిలో భాగంగా 75 కేజీల బస్తా ఒకటికి ఏ గ్రేడ్ ప్రభుత్వం అందించే మద్దతుధర 1420 రూపాయలు వరకు ఉండగా కేవలం ఆరోగ్య ధాన్యాన్ని కూడా స్థానిక వ్యాపారస్తులు బస్తా ఒకటి కి పదమూడు వందల రూపాయలు కూడా రైతులకు ఇవ్వడం లేదని విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అరుగుదల ధాన్యాన్ని ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటే వరి యంత్రం ద్వారా కోసం ధాన్యం తేమ అధికంగా ఉందంటూ వెయ్యి నుంచి 1100 వరకు మాత్రమే ధరనున్నిర్వహిస్తున్నారు. ఫలితంగా రైతులు ఒక్కొక్క భ స్తాకు మూడు నుంచి నాలుగు వందలు వరకు నష్టపోతున్నారని విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
పని చేయని రైతు భరోసా కేంద్రాలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా కేంద్రం ద్వారా ధాన్యాన్ని పెద్దమొత్తంలో కొనుగోలు చేయాలని చెప్పిన రైతు భరోసా కేంద్రాలు ఎక్కడా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. రైతు భరోసా కేంద్రాలకు రైతులు వెళ్లి తమ ధాన్యాన్ని అమ్మకం చేస్తామని చెప్పిన సిబ్బంది నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక వాననక అనేక ఇబ్బందులు పడి పెట్టుబడులు పెట్టి పండిన ధాన్యానికి ప్రభుత్వం అందించే మద్దతుధర లభించకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గత సంవత్సరం రబీ పంట పూర్తిస్థాయిలో పండినా వడగండ్ల వాన రూపంలో రైతులకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరం రైతులు ఆశించినంతగా పంటలు పండినా సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే గత వారం పది రోజులుగా వాతావరణ పరిస్థితులు కూడా మారుతూ ఉండటంతో విధిలేని పరిస్థితులలో ఉన్న ధాన్యాన్ని నిలువ చేయలేక వర్షానికి దాయలేక పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు తన ధాన్యాన్ని తక్కువ ధరలకే అమ్ముకుని మరోసారి మోసపోతున్నాడు. అధికారులు పాలకులు స్పందించి రైతులు పండించిన ధాన్యానికి కి మద్దతు ధర లభించే దిశగా తగిన ప్రయత్నాలు చేయాలని రైతులు కోరుతున్నారు..
ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే..
రబీ పంటలు విస్తారంగా పండినా పండిన ధాన్యాన్ని అమ్ముకోవడం లో రైతన్నలు మరోసారి మోసపోయారు. ఏ గ్రేడ్ రకానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా జిల్లాలో ఎక్కడా కూడా రైతులకు మద్దతు ధర కనిపించడం లేదు. రెవెన్యూ యంత్రాంగం తో పాటు వ్యాపారస్తులు కూడా కుమ్మక్కై రైతులను నిలువునా దోచేస్తు న్నా రు. అధికారులు పాలకులు వాగ్దానాలు ఇవ్వడం కాకుండా రైతుల దగ్గర నిల్వ ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి సకాలంలో వారికి నగదును వారి ఖాతాలో జమ చేయాలి. లేనిపక్షంలో రైతులకు మద్దతు ధర అందకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతాం.. – తూర్పు కృష్ణా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గౌరీ శెట్టి నాగేశ్వరరావు..
రైతులను ఆదుకునే వారు కరువయ్యారు..
రైతులు కష్టపడి పెట్టుబడులు పెట్టి ఎండనక వాననక పండించిన ధాన్యానికి నేడు గిట్టుబాటు ధర కరువైంది. – బెల్లంకొండ లక్ష్మణ.. రైతు.. సంఘ మూడి..