గంపలగూడెం :మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో శనివారం నూతనంగా నియమితులైన సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ సభ్యుల ప్రమాణస్వీకారం కోలాహలంగా జరిగాయి ఆయా గ్రామ పంచాయతీల వద్ద పంచాయతీ కార్యదర్సులు,సచివాలయ సిబ్బంది పాల్గొని నూతన సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించి అభినందనలు తెలిపారు అంతకుముందు బాపూజీ మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ప్రమాణస్వీకారం ముగిసాక సర్పంచ్,వార్డు సభ్యులు నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, జల శక్తి అభియాన్‌లపై సంకల్ప స్వీకారం చేసారు తదుపరి గ్రామపంచాయతీ మొదటి సమావేశం నిర్వహించి,గ్రామ పర్యటనలో భాగంగా మంచినీటి సరఫరా,పారిశుధ్యం,అంగన్వాడీ కేంద్రాలు,ఆరోగ్య కేంద్రాలు పరిశీలించి ఏప్రిల్ మాసంలో నిర్వహించాల్సిన కార్యాచరణ రూపొందించారు గ్రామ ప్రథమ పౌరులుగా బజ్జూరి చంద్రశేఖర్(అమ్మిరెడ్డిగూడెం),అత్తునూరి దీప్తి(అనుముల్లంక),కూరాకుల త్రివేణి(ఆర్లపాడు) ,గద్దల కోటయ్య(చింతలనర్వ), బంకా బాబూరావు(దుందిరాలపాడు),చెన్నా శ్రీనివాసరావు(గాదెవారిగూడెం), కోట పుల్లమ్మ(గంపలగూడెం),కందిమల్ల పిచ్చియ్య(గోసవీడు),పి. వెంకటలక్ష్మి(గుళ్ళపూడి),మండా మారేశ్వరమ్మ (కనుమూరు), ఇలవరపు నాగమణి(కొనిజర్ల),నరెడ్ల ఓగిరెడ్డి(కనుమూరు),కేసరి వేణుగోపాల్ రెడ్డి(లింగాల),గుండ్ల లక్ష్మీ(మేడూరు), దుబ్బాకుల రామకృష్ణ(నెమలి),వేముల కస్తూరి(పెద్దకొమిర),సంగెపు లలిత(పెనుగొలను),బొళ్లిపోగు రేణుక(ఊటుకూరు),చెన్నుపాటి నరసింహారావు(రాజవరం),వెన్నపూస గోవర్ధన్ రెడ్డి(సత్యాలపాడు),ఉన్నం కృష్ణారావు (సొబ్బాల),నిదికొండ మాధవి(తునికిపాడు),తోటకూర వీరప్రసాద్(ఉమ్మడదేవరపల్లి),చింతా ఉమాదేవి(వినగడప) బాధ్యతలు స్వీకరించి గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రజలందరికీ అందుబాటులో ఉండి సమస్యలు లేకుండా చూస్తామని పేర్కొన్నారు ఆయా కార్యక్రమాల్లో వివిధ పార్టీల నాయకులు,మద్దతుదారులు పాల్గొని చేయిచేయీ కలిపితేనే ప్రగతి మాల అని గుర్తుంచుకోవాలని తెలిపి వారిని అభినందించారు
Advertisement
తాజా వార్తలు
Advertisement