విజయవాడలో మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది. నూజివీడు ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఇటీవల దుబాయ్ నుంచి వచ్చింది. ఆ కుటుంబంలోని మూడు సంవత్సరాల చిన్నారికి ఒంటిపై దద్దుర్లు రావడంతో విజయవాడలోని జిజిహెచ్ కు తరలించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మంకీ ఫాక్స్ గా అనుమానించి శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ పంపించారు. కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ లో ఉంచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement