సామాజిక న్యాయం అమలు చేస్తూ అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ జనరంజకంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలోకృష్ణా జిల్లా డిసిసిబి నూతన పాలక వర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బముగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో సామజిక న్యాయం అమలవుతోందనటానికి ఈ డిసిసిబి నూతన పాలకవర్గం ఎన్నిక నిదర్శనమన్నారు . అన్ని సామాజిక వర్గాలకు సమకాలీన న్యాయం మన సీఎం జగన్ ద్యేయమని ఆ విధంగా అన్ని సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు . అవినీతి రహిత బ్యాంకింగ్ వ్యవహారాలు , నాణ్యమైన సేవలను అందించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్టు మంత్రి తెలిపారు . ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల కన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల అమల్లో మన రాష్ట్రము దేశానికే ఆదర్శగా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు . శాఖా పరంగా వ్యవస్థను మరింత పారదర్శకంగా చేసేందుకు సహకార శాఖలో సంస్కరణలు చేపడుతూ సహకార బ్యాంకులను బలోపేతం చేస్తున్నామన్నారు. రైతుల భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకత కలిగిన వ్యవస్థను తయారు చేస్తున్నామని వివరించారు.
నిధుల దుర్వినియోగాన్ని, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించమనని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. సహకార శాఖలో ఆడిట్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటిల్లో పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేబడుతున్నామన్నారు . అబ్కాబ్లో నూతన మానవ వనరుల పాలసీని అమలు చేస్తున్నామన్నారు .వాణిజ్య బ్యాంకులతో పోటీపడేలా మన సహకార బ్యాంకుల సేవలు విస్తృతం చేయాలనని ఆయన అభిలాషించారు. నాబార్డు వారి నాబ్కాన్స్ సంస్థ ఆధ్వర్యంలో సహకార శాఖ బలోపేతానికి అమలు చేయాల్సిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు . అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కృష్ణా జిల్లా డిసిసిబి సుమారు రూ .7200 కోట్ల టర్నోవర్ తో పురోగతి సాధిస్తోందన్నారు . ఈ సహకార కేంద్ర బ్యాంకుకి మంచి చరిత్ర వుంది మరెంతో ఉన్నతమైన భవిష్యత్తు వుందని మంత్రి కన్నబాబు చెప్పారు.