Sunday, September 22, 2024

భావితరాల కోసం మొక్కలు నాటాలి: మల్లాది విష్ణు..

విజ‌య‌వాడ – భవిష్యత్‌ తరాలు భూమిపై మనుగడ సాధించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అన్నారు. 58వ డివిజన్ లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్ లో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. జీవకోటి మనుగడకు చెట్లు ఆధారమని, కనుక ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసు కోవాలన్నారు. రాబోవు వర్షాకాలంలో ప్రతి డివిజన్ లోనూ కనీసం 500 మొక్కలు నాటే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. తద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవలందిస్తున్న సేవా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ కార్పొరేటర్ అవుతు శైలజారెడ్డి , 59వ డివిజన్ కార్పొరేటర్ షరీనా సుల్తానా, 61వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి , 62వ డివిజన్ కార్పొరేటర్ అలంపూరి విజయలక్ష్మి , 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి , 25వ డివిజన్ కార్పొరేటర్ బంకా శకుంతలదేవి , పాఠశాల ఫౌండర్స్ పిన్నమనేని త్రిమూర్తి రాజు , శ్రీ పి.అప్పలరాజు , హెడ్ మాస్టర్ జీ.వీ.రమణ , ప్రిన్సిపల్ జి.హరిత మాధవి , ఫౌండేషన్ సభ్యులు వై.ఎన్.పి.శివకుమార్ , శారదావాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement