Friday, November 22, 2024

AP | ఉధృతంగా కట్టలేరు.. ఇరుక్కుపోయిన లారీ !

(ఎ.కొండూరు ,ఆంధ్రప్రభ) : తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గంపలగూడెం కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గంపలగూడెం మండలంలో ప్రధాన నీటి వనరైన కట్టలేరు వాగు పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఎగువన తెలంగాణ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తోట మూల, వినగడప గ్రామాల మధ్య వంతెన పై వరద నీరు పోటెత్తింది.

ధ్వంసం అయిన వంతెన ప్రక్కన నిర్మించిన తాత్కాలిక రహదారిపై లోడుతో ఉన్న టిప్పర్ లారీ వరద నీటిలో చిక్కుకుపోయింది. దీంతో సమీప 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా చీమలపాడు, తిరువూరు, గంపలగూడెం, తోట మూల గ్రామాల నుండి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు తిరగకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వరదలో చిక్కుకుపోయిన లారీని తొలగించి ప్రయాణికుల కష్టాలను గట్టెక్కించాలని ఈ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement