Saturday, November 23, 2024

ఎగరలేని గుడ్లగూబకు సపర్యలు చెసిన స్థానికులు…

ప్రభాన్యూస్ : వాతావరణ పరిస్థితుల ప్రభావమో, విద్యుత్ వైర్లు తగిలి గుడ్లగూబ పోదల్లోకి వచ్చి పడింది. పాయకపురం శాంతి నగర్ ప్రాంతంలోఈ సంఘటన చోటుచేసుకుంది. ఐతే స్థానికులు ఆ పోదల్లో ఉన్న గుడ్లుగూబను బయటకు తీసేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. అసలే గుడ్లగూబ అంటే కళ్ళు పొడుస్తాయని ప్రజల్లో భయం అలాగే ఉండటంతో దాని వద్దకు వెళ్లి, దాన్ని పట్టుకోవాలంటే స్థానికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఎలాగైతేనేం ధైర్యం చేసి స్థానికులు ఆ గుడ్లగూబని పట్టుకొన్నారు. అయితే ఆ గుడ్లగూబ గోధుమ రంగుతో ఉండి, చాలా బలహీనంగా ఉంది. దాని కాళ్లకు ప్లాస్టిక్ వైర్లతో కట్టి వేయబడి ఉంది. ఎలాగైనా ఆ కాళ్లకు చుట్టుకొని ఉన్న వైర్లు తొలగించినప్పటికీ, ఆ గుడ్లగూబ పైకి ఎగరలేని పరిస్థితి నెల్కొని ఉంది.

గుడ్లగూబ రెక్కల వద్ద పరిశీలించగా ఆ రెక్కలు వద్ద గాయంతో ఉంది. స్థానికులు ఆ గుడ్లగూబకు మానవీయ కోణంలో సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేదు. ఆ గుడ్లగూబ కాళ్ళు, రెక్కలు, మెడ, ముక్కు, నోటి భాగాలను శుభ్రం చేస్తూ, నోటిలో కాస్తంత మంచినీరు పోసి దాని ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు స్థానికులు. అసలే చలికాలం కావడంతో ఆ గుడ్లగూబ వణికిపోతూ ఉంది. ఎండ తగిలే చోట దాన్ని నిలబెట్టినప్పటికీ, అది ఎగరలేని స్థితి. గుడ్లగూబకు కళ్ళు పగటిపూట కనిపించవని, రాత్రివేళలోనే అది ఎగురుతూ అన్నీ చూస్తాయని స్థానికుల బలమైన ఆలోచనతో, రాత్రి వరకు వేచి చూశారు. తీరా అర్ధరాత్రి కావడంతో దానికి కావాల్సిన నీరు ఉంచి స్థానికులు అక్కడనుండి వెళ్ళిపోగా గుడ్లగూబ ఆ రాత్రే అక్కడ నుండి ఎగిరి పోయిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement