Tuesday, November 19, 2024

అక్రమ మద్యం రవాణా – ఏడుగురి అరెస్టు

మైలవరం, – స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెద్దిరాజు ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి తెలంగాణ నుండి అక్రమంగా మధ్యం తరలిస్తున్న,విక్రయాలు జరుపుతున్న ఒక మహిళ ఆరుగురు వ్యక్తులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 410 (180 ఎమ్ఎల్)మధ్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ “డేగ ప్రభాకర్ వెల్లడించారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్ససైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ శాఖ అక్రమ మధ్యం,గంజాయి రవాణా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.అందులో భాగంగానే మండలంలోని “పుల్లూరు’ వద్ద ఏ.కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమ మధ్యం తరలిస్తుండగా పట్టుకుని వారి వద్ద నుండి 44 మధ్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.అదే విధంగా గణపవరం అడ్డరోడ్డు స్కూల్ వద్ద మారుతి కారులో తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 274 బాటిళ్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గణపవరం’ గ్రామంలోని నివాస గృహాల్లో తనిఖీలు నిర్వహించగా ఒక మహిళ వద్ద నుండి 70 బాటిళ్లు స్వాధీనం చేసుకోగా మరో ఇంట్లో ఒక వ్యక్తి వద్ద నుండి 22 మధ్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ “డేగ ప్రభాకర్ తెలిపారు.మధ్యం అక్రమ రవాణా,విక్రయాలు, గంజాయిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్ససైజ్ శాఖ గట్టి నిఘా ఉంచి పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రశంసించి,రివార్డుల కొరకు జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెద్దిరాజు, ఎస్సై బాలాజి,మహిళా పోలీస్ కాజా లలితకుమారి,ఎక్ససైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement