Tuesday, November 26, 2024

AP | అమృత్ భారత్ స్టేషన్ల పథకం లో అభివృద్ధిని ప్రశంసిస్తూ లేఖ

కేదరేశ్వరపేట, (ప్రభ న్యూస్) : అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్లకు అభివృద్ధి కోసం ఆదివారం శంకుస్థాపన చేసి అభివృద్ధి పరుస్తున్న మహాతర కార్యక్రమానికి నిడదవోలుకు చెందిన అప్సానా మహమ్మద్ అనే విద్యార్థి ప్రశంసిస్తూ సలహాలు పెట్టెలో ఒక లేఖ వేశారని ప్రజాసంబంధాల అధికారినుస్రత్ ఎం. మంద్రుప్కర్ తెలిపారు. విజయవాడ డివిజన్, దక్షిణ మధ్య రైల్వేలో అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద 11 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి.. రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన బృహత్తర కార్యానికి మద్దతుగా, ప్రోత్సహించేందుకు అప్సానా మహ్మద్ అనే కళాశాల విద్యార్థి నిడదవోలులో ఒక ప్రశంసా పత్రాన్ని రాసి, లేఖతోపొటు సలహా పెట్టెలో ప్రశంసా పత్రంతో పాటు యాభై రూపాయలు పెట్టెలో వేశారు.

ఒకేసారి 508 రైల్వే స్టేషన్లను పునరుద్ధరించేందుకు భారతీయ రైల్వేలు ప్రారంభించిన పునరాభివృద్ధి కార్యక్రమాన్ని ఈ లేఖలో ప్రశంసించారు. స్టేషన్లను ఆధునీకరించడానికి నైపుణ్యం కలిగిన నిపుణులతో కూడిన కొన్ని వినూత్న ఆలోచనలు, విలువైన సూచనలను కళాశాల విద్యార్థి పంచుకున్నారు. లేఖను నిడదవోలు స్టేషన్ సిబ్బంది గుర్తించి బుకింగ్ కార్యాలయంలో డబ్బులు జమ చేశారు.

- Advertisement -

విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ నరేంద్ర ఎ పాటిల్ కళాశాల విద్యార్థిని అభినందించారు. విజయవాడ డివిజన్‌లోని 11 స్టేషన్ల పునరాభివృద్ధి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా అనుసరించి ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా వేగవంతం చేస్తామని డీఆర్‌ఎం పేర్కొన్నారు. కళాశాల విద్యార్థి నుండి ప్రశంసా పత్రం అన్ని అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుండి భాగస్వామ్యం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement