మచిలీపట్నం – ఎన్నికల విధులు ఆటకం కలిగించారనే ఆరోపణలపై అరెస్టైన టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ లభించింది.. నేటి ఉదయం ఆయనను ఆరెస్ట్ చేసిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా బెయిల్ మంజూరు చేయవలసిందిగా కొల్లు తరుపు న్యాయవాదులు అభ్యర్ధించారు.. కేసును పరిశీలించిన జిల్లా జడ్జి పోలీసులు ప్రొజీజర్ను ఫాలో కాలేదని జడ్జి అభిప్రాయపడ్డారు. అలాగే పోలీసుల విచారణకు సహకరించాల్సిందిగా కొల్లు రవీంద్రను న్యాయమూర్తి ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement