చట్టం అందరికీ సమానమేనని.. చట్టానికి అశోక్ బాబైనా.. చంద్రబాబైనా ఒక్కటేనని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… అశోక్ బాబు అరెస్టుపై టీడీపీ గగ్గోలు పెడుతోందన్నారు. అశోక్ బాబు ఇంటర్ చదివి డిగ్రీ చదివినట్లు దొంగ సర్టిఫికెట్లు పెట్టాడ్నారు. ఇతరులకు రావాల్సిన ప్రమోషన్ ను కొట్టేశాడన్నారు. కానీ ఏం తప్పు చేశాడని చంద్రబాబు సిగ్గు లేకుండా అడుగుతున్నాడన్నారు. అలాగే జిల్లా ఎన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తారా ? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాలపై కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు. హిందూపురంలో జిల్లా కేంద్రం కావాలంటున్నారన్నారు. అదేవిధంగా కడప, కృష్ణాలోనూ రాద్దాంతం చేస్తున్నారన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital