(ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్) కొడాలి నాని కి పిచ్చి పట్టి ప్రేలాపనలు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన చంద్రబాబు సభ గుడివాడలో విజయవంతం అవుతుందని అన్నారు. కొడాలి నాని గుడివాడ పిచ్చికుక్క అంటూ ఘాటుగా విమర్శించారు.
కొడాలి నానికి రేబీస్ ఇంజెక్షన్లు చేయించాలి అని చాలా సార్లు చెప్పాను కానీ ఆ పార్టీ వాళ్లు వినిపించుకోవడం లేదన్నారు. పిచ్చి తగ్గించేందుకు కొడాలి నాని కి రేబీస్ ఇంజక్షన్లు కొరియర్ చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో సభ పెడుతున్నారనీ, ఊరంతా తిరుగుతానని కొడాలి నాని అంటున్నారని, గుడివాడ ప్రజలను ఏం చేస్తాడో అని ఇంజెక్షన్లు కొన్నానన్నారు. నా సొంత డబ్బులతో 5 రేబీస్ ఇంజెక్షన్లు కొని గుడివాడకు పార్శిల్ చేస్తున్నట్లు ప్రకటించారు. జనాల సెఫ్టీ కోసం ఇంజెక్షన్లు కొని కొడాలి నానికి పంపుతున్నట్లు తెలిపారు. డాక్టర్ సూచనలకు అనుగుణంగా ఈ ఇంజక్షన్లు తీసుకోవాలని సూచించారు. కొడాలి నాని రెండు కాళ్లు విరక్కొట్టి పోయ్యిలో పెడతారని ఇంకెప్పుడైనా చంద్రబాబును తిడితే తాటతీస్తానని హెచ్చరించారు. కొడాలి నానికి ఇంజెక్షన్లు చేయించాలని గుడివాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సారధి కేసిఆర్ అయితే…. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది తానేనన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆఫీసు లో బోర్డులపై మార్పుపై స్పందించిన బుద్దా వెంకన్న కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబువి మాత్రమే అన్నారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ మేమే పెట్టామని బోర్డులు పెట్టుకుంటే… అదంతా అభూతకల్పనగా చెప్పారు. నానికి పంపించినట్లే మరో నలుగురైదుగురికి రేబిస్ ఇంజెక్షన్లు పంపాల్సి ఉందన్నారు. డబ్బులు టైట్ గా ఉన్నాయని చూసుకుని అందరికీ ఇంజక్షన్లు పంపిస్తానన్నారు. ఉషశ్రీ, శంకరనాయక్, కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి లాంటి బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్నారనీ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. బలహీన వర్గాలు చంద్రబాబు కు కొమ్ము కాస్తున్నారని టిడిపిని చంద్రబాబుని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి బస్సు యాత్రలో మొత్తం రెడ్లే అనిపిస్తుంటే అది బీసీ యాత్ర ఎలా అవుతుందన్నారు. బీసీ వర్గానికి చెందిన నేతనని చంద్రబాబుకు బిసిలు కమిట్మెంట్ గా ఉంటారని సార్వత్రిక ఎన్నికల్లో మూకుమ్మడిగా బీసీ ఓట్లన్నీ తెదేపాకే పడతాయన్నారు.