విజయవాడ: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తక్షణం తాను పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపి కేశినేని నానీ తేల్చి చెప్పారు.. తనపై సొంత పార్టీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అసలు చంద్రబాబు రూట్ మ్యాప్ మార్పుతో తనకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కలిసి రూపొందించాయన్నారు. తన తీరు నచ్చకపోతే తనపై ఆరోపణలు చేసినవారు చంద్రబాబుకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని తేల్చి చెప్పారు. విమర్శలను వారి విచక్షణకు వదిలేస్తున్నానన్నారు. కాగా, తన వెంట ఉన్నది, తాను ఆత్మ బంధువులుగా భావించేది బీసీలు, ముస్లిం మైనార్టీలేనని అన్నారు.. సీట్ల కేటాయింపులో తాను విభేదించింది కూడా బ్రాహ్మణ, బీసీ సీట్ల కోసమేనన్నారు. తాను తప్పు చేసినట్లు పార్టీ భావిస్తే తనను సస్పెండ్ చేయొచ్చని తేల్చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement