Wednesday, November 20, 2024

AP : కేశినేని నాని చీటర్‌… మాజీ ఎమ్మెల్సీ బుద్దా

(ప్రభ న్యూస్‌, ఎన్టీఆర్ బ్యూరో): ఫైనాన్స్‌ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్‌ కేసు ఉందని, ఎన్నికల అఫిడవిట్‌లో ఆ కేసు వివరాలు పొందుపరడకుండా ఎలక్షన్‌ కమిషన్‌ను మోసం చేశారని, చీటింగ్‌ కేసులు ఉన్న నాని పోటీ-కి అనర్హుడని, ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. గర్భంలోనే బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

- Advertisement -

కేశినేని నాని చీటర్‌, 420 అని అందుకే అనేక మంది ని మోసం చేశాడన్నారు. నాని చీటర్‌ కాబట్టే చంద్రబాబు మెడ పట్టి బయటకు గెంటేశారంటూ ఘాటుగా విమర్శించారు. ఊసరవెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదని అన్నారు. 2014లో వేసిన అఫిడవిట్‌ లో శ్రీరామ్‌ చిట్స్‌కు, ఐ.ఓ.బి కి రూ ముప్పై కోట్లు- బకాయిలు చెల్లించాలని రాశాడన్నారు. ఏదేళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నీచ, నికృష్టుడు అనే పదాలకు నాని సరిపోతాడన్నారు. అప్పులు ఎగ్గొట్టినందుకు, కార్మికులు ను అన్యాయం చేసినందుకు నానిపై చీటింగ్‌ కేసు పెట్టారని అన్నారు. ఆస్తులు , అప్పులు రాసిన నాని ఈ కేసు విషయం అఫిడవిట్‌ లో నాని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినెషన్‌ ను తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. కేశినేని నాని విజయవాడకు పట్టిన దరిద్రమన్నారు.

కేసుల విషయం దాచిన కెశినేని నాని పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఆస్తులు అమ్మి అయినా అప్పులు కట్టాలి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం లో టిడిపి కార్యకర్తలు కష్టం తో కేశినేని నాని ఎంపీ అయ్యాడన్నారు. చంద్రబాబు, సుజనా చౌదరి వెనుక తిరిగిన చరిత్ర మరచిపోవద్దని హితవు పలికారు. సుజనా చౌదరి తాతల కాలం నుంచి సుజనా కుటు-ంబం విజయవాడ పార్లమెంటు- పరిధిలో ఉన్నారని కాని స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారన్నారు. ఓటమి భయం తో, చేతకానివాళ్లే ఇలాంటి అనవసర అంశాలను వివాదం చేసి లబ్ధి పొందుతారన్నారు.

నానికి ప్రజా సేవ కోసం కాదని… అప్పులోళ్ల నుంచి రక్షించుకునేందుకు ఎంపీ పదవిని అడ్డు పెట్టు-కుంటు-న్నాడని అన్నారు. ప్రజారాజ్యం, టిడిపి, లను మోసం చేసిన నాని … వైసిపిలో చేరి భజనలు చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గం లో పర్యటించి సుజనా చౌదరి, చంద్రబాబు పై నోరు పారేసుకుంటున్నాడన్నారు. నానికి వాళ్ల అమ్మతో సహా కుటు-ంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు. తమ్ముడు తనకు పోటీ-గా నిలబడితే.. చెల్లి కూడా తన ఛాయలకు రాలేదన్నారు. ఎవరి ద్వారా లబ్ది, సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజామన్నారు. నాని ఒకప్పుడు సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టు-కుని తిరిగెవాడన్నారు. సుజనా ద్వారా నాని ఎంత సాయం పొందాడో తమకు తెలుసన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement