Friday, November 22, 2024

కేంద్రీయ విద్యాలయంలో సీటు తన పరిధిలోనికి రాదన్న మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం – అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రియ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని ఖాళీలు పదుల సంఖ్యలో ఉంటే దరఖాస్తులు వందలు, వేలల్లో వస్తున్నాయిని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నావెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మంత్రి కార్యాలయం వద్దకు పలువురు ప్రజలు తమ సమస్యలు విన్నవించుకొనేందుకు హాజరయ్యారు. ఒక మహిళ మంత్రి పేర్ని నాని వద్దకు వచ్చి మచిలీపట్నంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయ్యిందని తన కుమారునికి కేంద్రీయ విద్యాలయంలో సీటు ఇప్పించాలని అభ్యర్ధించింది.
ఈ విషయమై స్పందించిన ఆయన మాట్లాడుతూ, 1965 లో “సెంట్రల్ స్కూల్స్” అన్న పేరుతో సీబీఎస్సీకి అనుగుణంగా మొదలయ్యాయిని ఆ తరువాత కేంద్రీయ విద్యాలయ అని పేరు రూపాంతరం చేసారని చెబుతూ, ప్రాథమికంగా ఈ విద్యాలయాలను భారత రక్షణా వ్యవస్థ, భారత ఆర్మీలో పనిచేసే సైనికుల పిల్లల కోసం నిర్మించారన్నారు. ఆర్మీ వారు సొంత విద్యాలయాలు నెలకొల్పాక కేంద్రీయ విద్యాలయాలను అన్ని కేంద్ర సంస్థలకు అందుబాటులో తెచ్చారని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరచూ స్థానబదిలీ సమస్యను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలను రూపొందించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గల అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఒకే సిలబస్ ఉంటుందన్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అనబడే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈ విద్యాలయాలను నడుపుతుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 1085 కేంద్రీయ విద్యాలయాలు ఉంటే, వాటిలో 1081 భారతదేశంలో ఉండగా, నాలుగు విదేశాల్లో ఉన్నాయిన్నారు. ఈ పాఠశాల ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. అలాగే, కేంద్ర అనుబంధ సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు, ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. అదేవిధంగా పార్లమెంట్‌ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మావన వనరుల మంత్రిత్వశాఖ, కేవీఎస్‌ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుందని తాను రాష్ట్ర మంత్రి అయినప్పటికీ తన సిఫార్సులు కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల్లో ఏమాత్రం చెల్లవని ఆ మహిళకు తెలిపారు.
కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైందని 2021-22 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 1 నుంచి మే 31వ తేదీకి ఇంటర్మీడియట్‌ మినహాయించి మిగిలిన అన్ని తరగతుల్లో ప్రవేశాలు పూర్తి చేసేందుకు ఆదివారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందన . ఒకటో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్‌ వరకు చదువుకోవచ్చని ఇక్కడ సీట్లు పొందేందుకు ఏటా విపరీతమైన పోటీ ఉంటుందన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement