పామర్రు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కైలే అనిల్‌కుమార్‌ను శాసనసభ హామీల కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు శాసనసభ కార్యదర్శి సోమవారం బులెటిన్ విడుదల చేశారు. కైలే అనిల్‌కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన హామీల కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు పర్వత పూర్ణచంద్రప్రసాద్, అన్నాబత్తుని శివకుమార్, కె.భాగ్యలక్ష్మి, మేడా మల్లికార్జునరెడ్డి, కె.శ్రీనివాసరావు, రామకృష్ణబాబు నియమితులయ్యారు. తనకు అవకాశం కల్పించిన సభా నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డికి, స్పీకర్ తమ్మినేని సీతారాంకు కైలే అనిల్‌కుమార్ ధన్యవాదాలు చెప్పారు. శాసనసభలో మంత్రులు ఇచ్చిన హామీల అమలును పర్యవేక్షించడం ఈ కమిటీ విధి.
Advertisement
తాజా వార్తలు
Advertisement