Saturday, September 21, 2024

AP: గంజాయిపై ఉక్కుపాదం.. 46 కేజీల గంజాయి స్వాధీనం, 17మంది అరెస్టు..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : గంజాయితో పాటు మాదకద్రవ్యాలు అక్రమ రవాణా వినియోగం సరఫరా విక్రయాలు చేస్తున్న వారినీ యాంటీనార్కోటెక్ సెల్ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిపిన పలు సోదాలు, దాడుల్లో 46 కేజీల గంజాయితో పాటు 17 మందిని అరెస్టు చేశారు. వివరాలను సీపీ రాజశేఖర్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాంటీ నార్కోటిక్ సెల్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రత్యేక బృందాలు గంజాయి విక్రయించే, తరలించే వారిపై 28 కేసులు నమోదు చేసి 77మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 185 కె.జి.ల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో యాంటి నార్కోటిక్ సెల్ లా అండ్ ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు నగరంలోని వివిధ ప్రదేశాల్లో అనుమానంగా తిరుగుతున్న 17మందిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 46 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేశామన్నారు.

విజయవాడ సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరందరూ వేరు వేరు మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారనీ చెప్పారు. వీరిలో గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తులు అయిన విశాఖపట్నం కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన పోలేజి సాయి, విశాఖపట్నం కొయ్యూరు గుమ్మడి వారిపాలెంకు చెందిన కాకాని దేవరాజు లు సులభంగా డబ్బులు సంపాదించాలానే ఉద్దేశంతో విశాఖపట్నం ఏజెన్సీ గ్రామాలలోని కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని తక్కువ డబ్బులాకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనీ తెలిపారు. ఈ కేసులలో నిందితులైన మరికొందరు పరారిలో ఉన్నారనీ వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement