Sunday, November 24, 2024

Indrakeeladri – కాలినడకన తరలివస్తున్న భవానీలు…గంట గంటకు పెరుగుతున్న దీక్షాదారుల సంఖ్య

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరోఆదిపరాశక్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ స్వరూపంగా ఆవిర్భవించి, అవతరించి, అనుగ్రహిస్తున్న దివ్యమైన క్షేత్రములో అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. జై భవాని జై జై దుర్గ భవాని నామస్మరణతో ఇంద్రగిరలు పులకరించి పోతున్నాయి. దేవి, శారద శరన్నవరాత్రి ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరణలో ఉన్న జగన్మాతను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భవాని మాలధారధిలో భక్తులు తరలివస్తున్నారు

. ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుంటున్న భవానీల రాకతో ఇంద్రగిరలన్నీ ఎరుపెక్కాయి. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి భవానీలు పెద్ద ఎత్తున అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఇరుముడిని తల మీద పెట్టుకుని కాలినడకన ఇంద్రకీలాద్రి కి చేరుకుంటున్నారు. అమ్మవారి దర్శన భాగ్యం కోసం క్యూలైన్లో ఎదురుచూస్తున్న భవానీలు అమ్మ నామస్మరణ జపిస్తూ, భజనలు చేస్తూ, అమ్మని కీర్తిస్తూ పాటలు పాడుతూ ముందుకు సాగుతున్నారు. పెద్ద ఎత్తున భవానీల రాకను ముందుగా అంచనా వేస్తున్న అధికారులు దానికి అనుగుణంగా విస్తృత ఏర్పాటు చేశారు

. మలదరణతో కొండపైకి వచ్చి అమ్మవారి దర్శనం అనంతరం మాల విరమణ కోసం వచ్చే భవానీల కోసం మల్లికార్జున మండపం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒకవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మరోవైపు భవానీల రాక్షసి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆద్యంతం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement