Thursday, November 21, 2024

విజయవాడలో లుపిన్ డయాగ్నోస్టిక్స్ శాటిలైట్ ల్యాబొరేటరీ ప్రారంభం

అంతర్జాతీయంగా ఫార్మా అగ్రగామి లుపిన్ లిమిటెడ్ (లుపిన్) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ శాటిలైట్ ల్యాబొరేటరీని ఈరోజు ప్రారంభించినట్లు వెల్లడించింది. అధిక-నాణ్యత కలిగిన పరీక్షా సేవల అవకాశాలను మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్క్‌ను పెంచడం లక్ష్యంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ చేస్తున్న విస్తరణలో ఇది ఒక భాగం. ఈసంద‌ర్భంగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ సిఈఓ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ… వ్యాధుల నిర్వహణ, తగిన చికిత్సను గుర్తించడంలో ఖచ్చితమైన రోగ నిర్ధారణ తొలి అడుగుగా నిలుస్తుందన్నారు. త‌మ‌ అత్యాధునిక సాంకేతికత, వ్యక్తిగతీకరించిన స్మార్ట్ నివేదికలతో, రోగులు, వైద్యులు ఆరోగ్య ధోరణులపై విలువైన పరిజ్ఞానం పొందుతారన్నారు. పూర్తి సమాచారంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలరన్నారు.

నాణ్యమైన డయాగ్నస్టిక్‌ సేవలను సరసమైన ధరలో భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచడమే త‌మ లక్ష్యమ‌ని అన్నారాయన. వైద్యులు, రోగులు, వినియోగదారులకు అసమానమైన రోగనిర్ధారణ సేవలను అందించడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ అంకితం చేయబడిందన్నారు. నాణ్యత, ఖచ్చితత్వం పట్ల తమ స్థిరమైన నిబద్ధతను ప్రదర్శిస్తూ, లుపిన్ నాలుగు ప్రయోగశాలలు ఇప్పటికే ఎన్ఏబీఎల్ గుర్తింపును పొందాయన్నారు. ఈ విజయం నమ్మకమైన నాయకునిగా శ్రేష్ఠతకు ప్రాధాన్యతనివ్వడంలో లుపిన్ డయాగ్నోస్టిక్స్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. ఈకార్య‌క్ర‌మంలో లుపిన్ డ‌యాగ్నోస్టిక్స్ సీఈఓ ర‌వీంద్ర కుమార్ తో పాటు లుపిన్ లిమిటెడ్ కార్పొరేట్ కమ్యూనికేష‌న్స్ మేనేజ‌ర్ ప్రియాంకా చావ్డా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement