Friday, November 22, 2024

ఆన్ లైన్ బెట్టింగ్ లో భారీగా నష్టం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య…

ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి సూసైడ్ కలకలం సృష్టించింది. ఆత్మహత్య చేసుకునే ముందు.. తల్లికి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది.. వివరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద చెరువులో దూకి మంగళగిరి మండలం నవులూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్వేత (22) ఆత్మహత్య చేసుకుంది. శ్వేత మంగళగిరి నుంచి చిల్లకల్లు స్కూటీ మీద వచ్చినట్లు తెలుస్తోంది. శ్వేత ఆన్ లైన్ లో డబ్బులు పెట్టి మోసపోయినట్టు బంధువులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆన్ లైన్‌ లో బెట్టింగ్ కట్టి భారీ మొత్తంలో శ్వేత డబ్బులు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. శ్వేత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తల్లిదండ్రుల వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న చిల్లకల్లు పోలీసులు కేసు విచారణను మంగళగిరి పీఎస్ కి ఫార్వర్డ్ చేశారు. శ్వేత గత మూడు నెలల నుంచి వర్క్ ఫర్ హోమ్ లో విధులను నిర్వహిస్తోంది. ఈరోజు హైదరాబాద్ లో optam కంపెనీలో ఉద్యోగంలో చేరవలసి వుంది. అయితే శ్వేత శనివారం సాయంత్రం మంగళగిరిలో ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్వేత.. రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సప్ లో వాయిస్ మెసేజ్ పంపింది. శ్వేత సూసైడ్ పై తాత చంద్రబోస్ స్పందించారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది.. ఏం జరిగిందో తెలియదని అన్నారు. నాకు చాలా ప్రెషర్ ఉంది. అందుకే చెరువులో దూకి చనిపోతున్నానని 7.50 గంటలకు తన తల్లికి సెల్ ఫోన్ మెసేజ్ పెట్టిందని చెప్పారు. మెసేజ్ చూసిన వెంటనే మేము చెరువు దగ్గరకు హుటాహుటిన వెళ్లామ‌ని, అయితే అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం తన మనవరాలు శ్వేత చెరువులో శవమై కనిపించిందని తాత చంద్రబోస్ విలపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement