మండవల్లి :సంపూర్ణ ఆరోగ్యవంతులే గొప్ప ఐశ్వర్యవంతులు అని ప్రొఫెసర్ సుదాబత్తుల విజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక మండవల్లి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం మండవల్లి విశ్వ భారతి హై స్కూల్ లో ఆరోగ్యంగా జీవించడం ఎలా అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న విజయ్ కుమార్ మాట్లాడుతూ మానవాళిని కుదిపేస్తున్న కరోనాను ఎదురొడ్డి నిలవడం మనందరికీ రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యమన్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహారం , సమతుల పౌష్టికాహారాన్ని తీసుకొని ఆహార పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. డబ్ల్యూహెచ్ఓ 2021 నినాదం పోషకాహారం, క్రమశిక్షణ కలిగిన జీవనశైలి, శారీరక వ్యాయామం, శుభ్రత దురలవాట్లు లేకపోవటం, మానసిక ప్రశాంతతకు మంచి ఆలోచనలు చేయటం లాంటివి ఉపకరిస్తాయని ప్రకటించిందన్నారు శారీరకంగా మానసికంగా సామాజికంగా బాగుండటమే సంపూర్ణ ఆరోగ్యం అని వివరించారు.
ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎల్ ఎస్ భాస్కరరావు మండల అధ్యక్షుడు టి అప్పారావు మాట్లాడుతూ మానవాళి ఆరోగ్యంగా ఉండాలంటే నీరు పారిశుద్ధ్యం పరిసరాల పరిశుభ్రత కీలకమన్నారు పరిశుభ్రత లోపం వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వీటి లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జబ్బుల బారిన పడుతున్నారన్నారు. రక్షిత మంచినీటి సరఫరా ఆరోగ్య అవస్థకు మూలాధారం కలుషిత నీటి ద్వారా వచ్చే వ్యాధులకు భారత్ ఏటా రూ. 4400కోట్లు ఖర్చు పెడుతుందని యూనిసెఫ్ అంచనా వేసిందన్నారు. నేటి యువకులు చెడు అలవాట్ల వల్ల చనిపోతున్నారని, చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఆహారం ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తించటం ద్వారా మిమ్మల్ని మీతో పాటు చుట్టూ ఉండే వారిని రక్షించుకోవచ్చునని తెలిపారు.
సంపూర్ణ ఆరోగ్యవంతులే గొప్ప ఐశ్వర్యవంతులు ..
Advertisement
తాజా వార్తలు
Advertisement