ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః ఓటమి భయంతోనే ముఖ్య మంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిటి బ్యూరో సభ్యుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి , బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కోడి కత్తి, తరహాలో గులక రాయి డ్రామాకు కేశినేని నాని, వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని విమర్శించారు.
నగరంలోని ఆయన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంట్రల్ నియోజకవర్గంలో ముందస్తు ప్రణాళికతో సీఎంపై దాడి చేయించారన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంకా శ్రీను అనే రౌడీ షీటర్ తో ఈ పని చేయించినట్లు- తమకు సమాచారం వచ్చిందన్నారు. వంకా శీను పై ఈ దాడి సంఘటనకు సంబంధించి అనుమానాలు ఉన్నాయన్నారు. ముఖ్య మంత్రి పై హత్య యత్నం అని వైసిపి నాయకులు చెపుతున్నా వైసిపి కార్యకర్తలు ఒకరు నమ్మడం లేదన్నారు. గులకరాయి దాడి డ్రామా అని వైసిపి నేతలకు అర్థం కావడంతో ఒకరు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపలేదన్నారు. కేశినేని నాని, వెలంపల్లి శ్రీనివాస్ కాల్ డేట బయట పట్టాలని డిమాండ్ చేశారు.ముఖ్య మంత్రి వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీశారో సమాధానం చెప్పాలన్నారు.
జరిగిన ఘటన పై వెంటనే సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలన్నారు. ఐపాక్, ముఖ్యమంత్రి ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. నందిగామ, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు మీద దాడి జరితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టిడిపి నాయకుడు, మాజీ కార్పోపరేటర్ చెన్నుపాటి గాంధి కున్ను పోతే 307 సెక్షన్ నమోదు చేయలేదన్నారు. అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షలకు మరొక న్యాయమా అని ప్రశ్నించారు. తాము అధికారం లోకి వచ్చాక దీని వెనుక ఎవరున్నారో వాస్తవాలు బయట పెడతామన్నారు.
జరిగిన ఘటన పై గవర్నర్ను కలుస్తామన్నారు. వేల్లంపల్లికి కన్నుకు తగిలిందా..లేదా అనే వాస్తవలు కావాలంటే విdుడియా సమక్షంలో కంటి పరీక్షలు చేయించాలన్నారు. సానుభూతి కోసం చంద్రబాబుపై ఘటన జరిగిన నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ-లో ఉన్న తనపైన నోటికి వచ్చినట్లు- ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంపై దాడి కేసు విచారణ సీబీఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీబీఐ విచారణ జరపాలని కోరడానికి గవర్నర్ ను కలవనున్నట్లు బొండా ఉమా తెలిపారు.