Tuesday, November 26, 2024

బీచ్‌లో స్నానానికి వెళ్లి.. ఇద్దరు బి ఫార్మసీ విద్యార్థినులు దుర్మరణం

మచిలీపట్నం టౌన్‌, (ప్రభన్యూస్‌): కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో సోమవారం విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు అయిపోవడంతో సరదాగా స్నానం చేసేందుకు ముగ్గురు బీఫామ్‌సీ విద్యార్థినులు బీచ్‌ ఒడ్డులోనే స్నానాలు చేస్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద అల రావడంతో ముగ్గురు కొట్టుకుపోయారు. అలల ధాటికి కొట్టు-కు పోతున్న వీరిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు.

ఇంతలో మెరైన్‌ పోలీసులు విద్యార్థులు ముగ్గురిని కాపాడి ఒడ్డుకి చేర్చినప్పటికి, ఒడ్డుకి చేర్చిన 20 నిమిషాల్లో ఇరువురు విద్యార్థినులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కళ్లెపల్లి పూజిత (22), కాకర ప్రమీల(22) ఉన్నారు. వీరు భీమవరం విష్ణు కళాశాలలో బీఫామ్‌సీ చదువుతున్నారు. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బందరు రూరల్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement