(ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో): జనసేన పార్టీ ఓట్లు కొల్లగొట్టేందుకు వైసిపి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తుందని బిజెపి జనసేన పార్టీలు బలపరిచిన విజయవాడ లోక్సభ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాద్ ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థులకి గ్లాస్ గుర్తు కేటాయింపు పై పునః సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 45 డివిజన్ లో కేశినేని శివనాథ్, పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. కబేళా సెంటర్ లోని కళ్యాణ్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి మేనిఫెస్టో ఆపార్టీ కార్యకర్తలకే నీరసం తెప్పించిందన్నారు. గాజు గ్లాస్ సింబల్ ను జనసేన అభ్యర్ధులు పోటీ చేసే స్థానాల్లో ఫ్రీ సింబల్ గా ఇచ్చిన అంశాన్ని పునఃసమీక్షించాలనీ డిమాండ్ చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జనసేన ఓట్లు లాక్కోవటానికి స్వతంత్య్ర అభ్యర్థలకు గాజు గ్లాస్ సింబల్ ఇచ్చారు.
వైసిపి ఎన్ని కుయుక్తులు పన్నినా…వారి ఆటలు సాగవు..ప్రజలు అప్రమత్తతో ఉన్నారనీ అన్నారు. రోజు ఉదయం సమయంలో విజయవాడ మూడు నియోజకవర్గాలు, సాయంత్రం రూరల్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాట్లు చెప్పిన ఆయన ప్రజల స్పందన బ్రహ్మాండంగా వుందన్నారు. జగన్ ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారనీ, ప్రజలందరూ చంద్రబాబు రావాలి. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనీ కోరుకుంటున్నట్లు తెలిపారు. సంక్షేమం కావాలి. అమరావతి కావాలని కోరుకుంటున్నారనీ, 5 కోట్ల మంది ప్రజలు వారి భవిష్యత్తు బాగు కోసం ఎన్డీయే కూటమి గెలుపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కోరుకున్నట్లు తెలిపారు. వైసిపి మేనిఫెస్టోకి టిడిపి మేనిఫెస్టోకి చాలా వ్యత్యాసం వుందనీ, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ సంక్షేమం అందిస్తామనీ హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో లాగా కండీషన్స్ ఉండవని, అర్హులందరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు.