Monday, October 14, 2024

AP: కట్లేరుపై ఉధృతంగా ప్రవహిస్తున్న వరద… రాకపోకలు బంద్

గంపలగూడెం, జులై 20(ప్రభ న్యూస్) : అల్పపీడన ధోరణితో ఎడతెరపి లేని వర్షాలు కురవడం, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో వినగడప సమీప కట్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కట్లేరు వద్ద ధ్వంసమైన వంతెనపై, తాత్కాలిక రహదారిపై మూడడుగుల ఎత్తులో వరద నీరు ఉదృతంగా పోటెత్తుతోంది. దీంతో రాకపోకలు మూడు రోజులుగా స్తంభించాయి. తహశీల్దార్ సుగుణ ఆదేశాలతో ఎస్సై ఎస్.శ్రీను ఆధ్వర్యంలో సిబ్బంది ఎవరినీ రానీయకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

కనుమూరు, అనుముల్లంక, నారికంపాడు, వినగడప, కొత్తపల్లి గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి కోసం మండల కేంద్రం గంపలగూడెం చేరుకోవాలంటే అదనంగా 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని మండల ప్రజలు ఎవరైనా జిల్లా కేంద్రం విజయవాడ వెళ్లాలన్నా ఈ మార్గం నుండే ప్రయాణించాల్సి ఉండడంతో వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్నారు. వర్షాలు తగ్గగానే తక్షణ చర్యల్లో భాగంగా యుద్ధప్రాతిపదికన శాశ్వత వంతెన నిర్మాణం పనులు చేపడితేనే ఎలాంటి సమస్యలు ఉండవని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement