విజయవాడలోని ఎస్ఆర్ పేటలో నకిలీ టెన్త్ సర్టిఫికెట్ల భాగోతం బయటపడింది. బ్రోకర్స్ ద్వారా అన్నామలై వర్సిటీ ప్రతినిధులు ఫేక్ సర్టిఫికెట్లు ఇప్పిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సర్టిఫికెట్ ను అనంతపురం యువకులు రూ.లక్షన్నర పెట్టి కొన్నారు. పరీక్ష రాయకుండానే పదిరోజుల్లో నేరుగా సర్టిఫికెట్లు ఇంటికి వచ్చాయి. నకిలీ సర్టిఫికెట్లతో పోస్టల్ డిపార్టమెంట్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టల్ డిపార్ట్ మెంట్ వెరిఫికేషన్ లో ఫేక్ సర్టిఫికెట్లుగా నిర్ధారించారు. ఫేక్ సర్టిఫికెట్లు అని తెలిసి బ్రోకర్ ఆనంద్ ను యువకులు నిలదీశారు. సర్టిఫికెట్లు ఒరిజినలే అని అన్నామలై యూనివర్శిటీ ప్రతినిధులు అంటున్నారు. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని యువకులు గొడవ చేస్తున్నారు. సూర్యారావుపేట పోలీసులను యువకులు ఆశ్రయించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement