ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరోమహిషాసురుడిని వధ చేసి, రాక్షసులు అందరినీ అంతమందించిన జగన్మాత నేడు ఉదయం మహిషాసుర మర్దనీ దేవిగా భక్తులకు దర్శనము ఇచ్చారు. చంద్రుని సంహరించి చండిగా, చండుడుని, ముండుందు సంహరించి చాముండిగా, దుర్గాసురుడిని సంహరించి దుర్గగాను, మహిషాసురుని సంహరించి మహిషాసుర మర్ధిని గా శ్రావణ నక్షత్రం రోజున అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు 9వ అలంకరణలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు కటాక్షాన్ని కలిగిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు..
మధ్యాహ్నం నుండి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా..
పై రెండు చేతుల్లో పాశము, అంకుసము ధరించి, ఎడమచేతిలో తెల్లటి చెరుకు గడ దనస్సుగా, పుష్ప బాణాన్ని ధరించిన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో కనకదుర్గమ్మ వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పరమ పవిత్రం మైన స్వరూపం..పరమ సంపూర్ణ స్వరూపం..పరిపూర్ణ స్వరూపం శ్రీ రాజరాజేశ్వరీ దేవి స్వరూపం. ఉపాససుకులకు, సాధకులకు మూలమైన స్వరూపం రాజరాజేశ్వరి మహాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో అమ్మవారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి భక్తులకు దర్శనం ఇచ్చారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు చివరి రోజు సోమవారం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. రెండు రూపాయల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్ ల ద్వారా ఇంద్రకీలాద్రి కి చేరుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజుకు తోడు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రాక్ష సందర్భంగా క్యూలైన్ లన్ని కిక్కిరిసి ఉన్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగ్గిసాయి.
సాయంత్రం ఆదిదంపతులు హంస వాహనంపై కృష్ణమ్మ ఒడిలో విహరించనున్నారు. కృష్ణానదిపై నిర్వహించే తెప్పోత్సవం కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రానున్నారు. సోమవారం అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు లక్షన్నరకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుకూలంగా ఏర్పాటు పూర్తి చేశారు.