విజయవాడ: సంగం డెయిరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ధూళిపాళ్లపై ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ ఐదు రోజుల కస్టడీకి తీసుకుంది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అలాగే ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. సంగం డెయిరీ లావాదేవీల్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసులోధూళిపాళ్లను ఇరికించారని నరేంద్ర భార్య జ్యోతిర్మయి కంటతడి పెట్టారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధూళిపాళ్ల నరేంద్ర భార్య తెలిపారు. ధూళిపాళ్లను కలిసేందుకు ఏసీబీ కార్యాలయానికి న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వచ్చారు. అయితే పోలీసులు రామకృష్ణను ధూళిపాళ్ల నరేంద్రను కలవనీవకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత రామకృష్ణను ధూళిపాళ్లను కలుసుకోడానికి పోలీసులు అనుమతించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement