మచిలీపట్నం. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో కృష్ణా జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి జిల్లాలోని అన్ని వర్తక, వాణిజ్య సముదాయాలను సాయంత్రం 6 గంటలకే మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, ధరించనివారిపై రూ. 500 జరిమానా విధించాలని రెవెన్యూ, పంచాయతీ, పోలీస్, మునిసిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా విధిస్తామని తెలిపారు. మాల్స్, థియేటర్స్, ఫంక్షన్ హాల్స్‌లో మాస్క్ ధరించకుంటే రూ.1000 చోప్పున జరిమానా వేస్తామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement