Sunday, November 24, 2024

గంప‌ల‌గూడెంలో బంద్ సంపూర్ణం..

గంపలగూడెం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణ,నిత్యావసర వస్తువుల ధరలు పెంపున‌కు నిరసనగా శుక్రవారం చేపట్టిన బంద్ మండలంలో సంపూర్ణంగా జ‌రిగింది..సీపీఎం,సీపీఐ,తెలుగుదేశం,కాంగ్రెస్,పార్టీల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.గంపలగూడెం నుండి తోటమూల వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు,ప్రభుత్వ,ప్రవేటు విద్యాసంస్థలు మూయించివేశారు. అనంతరం తోటమూల వై జుంక్షన్ వద్ద అఖిల పక్ష నాయకులు రోడ్డు పై ధర్నా చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గువ్వల సీతారామిరెడ్డి,చెరుకు వీరారెడ్డి,జానపాటి వెంకటేశ్వరావు,యస్.కె.నాగులమీరా,రేగళ్ల వీరారెడ్డి,కొత్తా రజనీకాంత్, యడ్లపల్లి రామకృష్ణ, పలువురు నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.అదేవిధంగా ఊటుకూరులో బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ సి ఐ టి యు సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఊటుకూరు బస్టాండ్ సెంటర్లో భారత్ బంద్ కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ షేక్ ఉమ్మ రవ లీ మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు నాటి బ్రిటిష్ వారి పరిపాలనకు, తేడా ఏమీ కనిపించటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు చెరుకూరు రాధాకృష్ణ మూర్తి, సిపిఎం నాయకులు నందిగామ జనార్ధన చారి వైఎస్ఆర్ సీపీ నాయకులు కాజా నాగేంద్రం, జనసేన నాయకులు శ్రీరామ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పటాన్ బాబు,భవన నిర్మాణ నాయకులు ఖమ్మం కొండ,వీరంశెట్టి మురళి, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement