Monday, November 4, 2024

ఎ. కొండూరులో బంద్ ప్రశాంతం…

ఎ. కొండూరు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్ష కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మండల అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మండలంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు వర్తక వాణిజ్య వ్యాపార కేంద్రాలను, కాఫీ హోటళ్లను, సినిమాహాళ్లను, కిరాణా షాపులను, విద్యా సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం జగదల్పూర్ జాతీయ రహదారిపై మండలంలోని చీమలపాడు మెయిన్ రోడ్డు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు పెను భారంగా మారిన రైతు వ్యతిరేక మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని, పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని, సామాన్య మానవునికి భారంగా మారిన ఇసుక ధరలను తగ్గించాలని, బ్యాంకులను, ఎల్ఐసి సంస్థలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి, మండల బీసీ సెల్ నాయకులు, గ్రామ టిడిపి అధ్యక్షుడు బెజవాడ శంకర్, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి వనపర్ల డేవిడ్ రాజు, సిపిఐ మండల కార్యదర్శి మేకల డేవిడ్, షేక్ కరీముల్లా, సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, ఎస్ రామకృష్ణారెడ్డి, మండల రైతు సంఘం నాయకులు పానం ఆనందరావు, ఎస్. సోములు, జంగా కిషోర్ కుమార్, షేక్ కరీముల్లా, పీక్లానాయక్, భీమానాయక్, ఎస్ సుబ్బారావు, ఆదిశేషు, బాజీ, ఆదం షరీఫ్, రైతులు, పలు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement