Saturday, November 23, 2024

Vijayawada వన్ టౌన్ లో దారుణ హత్య..

(విజయవాడ ప్రభ న్యూస్) : నగరంలోని వన్ టౌన్ ప్రాంతాలో పట్టపగలు నడిరోడ్డు మీద ఒక వ్యక్తిని నిందితుడు హత్య చేయడం సంచలనంగా మారింది. మృతుడు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన మణికంఠ క్యాటరింగ్ లో పనిచేస్తున్న ఎసు గా పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రం వన్ టౌన్ ప్రాంతంలోని రమణయ్య కూల్డ్రింక్స్ వద్ద జరిగిన ఈ సంఘటనలో నిందితుడు మటన్ నరికే కత్తితో యేసును అతి దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన నిందితుడు గణేష్ అదే మణికంఠ క్యాటరింగ్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాల పై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్య జరిగిన తీరు స్ధానిక సీసీటివీ ఫుటేజ్ ను స్థానిక సీఏ సురేష్ రెడ్డి పరిశీలిస్తున్నారు. సిసిఫుటేజ్ అధారంగా హత్య చేసిన నిందితుడును గణేష్ ను వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డి అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా విచారిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని రమణయ్య కూల్ డ్రింక్స్ దగ్గర దారుణ హత్య సంబంధించిన వివరాలను వెస్ట్ ఎసిపి హనుమంతరావు వివరించారు.

వాసు అలియాస్ యేసు అనే అతను క్యాటరింగ్ కాంట్రాక్టర్లు చేసుకుంటూ ఉంటాడనీ, బ్యాంకు అరుగు మీద టీ తాగుతున్న సమయంలో గతంలో చాలాకాలం నుండి పనిచేసే గణేష్ అనే అతను యేసు దగ్గర పని చేస్తుంటాడన్నారు. గణేష్ 15వేల రూపాయలు అప్పు తీసుకుని తిరిగి అసలు డబ్బులు చెల్లించి వడ్డీ నిమిత్తం ఐదు వేల రూపాయలు ఇవ్వాలన్నారు. వడ్డీ నిమిత్తం గతకాలం గత కొంతకాలం నుంచి వీళ్ళిద్దరికీ గొడవ జరిగిందన్నారు. వడ్డీ నిమిత్తం మాట మాట పెరిగి సంచిలో ఉన్న కత్తితో మెడమీద నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న గణేష్ను విచారిస్తున్నట్లు తెలిపారు. దేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement