అమరావతి : కృష్ణా జిల్లా వత్సవాయిమండలం గోపినేని పాలెంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తొలుత పెనుగంచిప్రోలు శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా 920 మండలాల్లో ఈరోజు సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఎనిమిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పని చేస్తోందన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు ఇస్తే ఇక్కడ ప్రభుత్వం నిధులు మాయం చేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తున్న పరిస్థితి.. జాబ్ కార్డ్ హాల్డర్ కి రూ.18,000 ఇస్తున్నామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కోసం బీజేపీ ప్రభుత్వం నిధులిస్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital