గూడూరు, (ప్రభన్యూస్) : కృష్ణా జిల్లా గూడూరు మండలం పర్ణశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిండికేట్ బ్యాంక్ కి చెందిన క్యాషియర్ పల్లి వినోద్( 29) మృతి చెందాడు. వినోద్ కారులో జాతీయ రహదారిపై మచిలీపట్నం వైపు నుండి విజయవాడ వెళ్తుండగా వారి ముందు ఉన్న లిరీ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వినోద్ కారు లారికి వెనుక ఢీకొంది.
దాంతో వినోద్ కు తలకు బలమైన గాయం అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కార్ లోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గూడూరు ఎస్సై షేక్ మదీనా భాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital