11 మంది నిందితుల అరెస్టు..
ఫలిస్తున్న వంద రోజులు యాక్షన్ ప్లాన్..
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో పటిష్టమైన కార్యాచరణతో వంద రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న పోలీసుల శ్రమ ఫలిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పర్యవేక్షణలోని యాంటీ నార్కోటెక్ సెల్ కమిషనరేట్ పరిధిలో ఉన్న సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా గంజాయి రవాణా విక్రయం కొనుగోలు సరఫరా వంటి అంశాల్లో కీలకంగా ఉన్న నిందితులను అరెస్టు చేస్తున్నారు.
ప్రత్యేక బృందాలుగా విడిపోతున్న యాంటీనార్కోటిక్ సెల్ గంజాయి నిందితులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి క్రయ విక్రయాలు జరుపుతున్న 11మంది నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి సుమారు 24 కేజీల గంజాయిని దొంగిలించబడిన రూ.3లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.