Tuesday, November 26, 2024

అగ్గితెగులు నివారణ తగిన చర్యలు చేపట్టండి…

మండవల్లి, ప్రస్తుతం వరి పంటకు ఆశించిన అగ్గితెగులు నివారణకు చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారిణి షేక్ జరీనా రైతులకు సూచించారు.బుధవారం మండవల్లి మండలం లోని గన్నవరం గ్రామంలో వరి పంట పొలాలను పరిశీలించి అక్కడక్కడ అగ్గితెగులు ను గమనించి తగు సూచనలు చేశారు. ఈ తెగులు పిలక దశలో అగ్గి తెగులు గాను, కంకి దశలో మెడ విరుపు తెగులు గాను కనిపిస్తుందన్నారు. నత్రజని ఎరువు ఎక్కువగా వాడడం, విత్తన శుద్ది చేయక పోవడం,గట్ల మీద ఎక్కువగా కలుపు వుండడం వంటివి అగ్గి తెగులు వ్యాపించు టకు అనుకూల పరిస్థితులన్నారు.
అగ్గి తెగులు లక్షణాలు:
ఈ తెగులు పైరిక్యులేరియా ఒరైజా అనే శిలీంద్రము వల్ల వ్యాపిస్తుంది. ఆకులపై నూలు కండె ఆకారం లో గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఒకదానితో ఒకటి కలిసి పోయి ఆకులు ఎండి పోయి కనిపిస్తాయి.
అగ్గి తెగులు నివారణా చర్యలు:
ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ను నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
పొలం గట్లు శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తన శుద్ధి చేయాలి. అగ్గి తెగులు తట్టుకొనే విత్తన రకాలను సాగు చేయాలి. నత్రజని ఎరువును తగ్గించాలి.
ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఆకాంక్ష మరియు రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement